Rajitha Chanti |
Nov 30, 2024 | 9:46 PM
2016లో రష్మిక కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీరంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేసిందట.
తన టాలెంట్‌కు తగ్గట్టు అవకాశం వస్తేనే నటించాలని రష్మిక నిర్ణయించుకుంది. మొదటి సినిమాతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ వచ్చాయి.
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు అల్లు అర్జున్ సరసన పుష్ప 2 మూవీతో మరోసారి పాన్ ఇండియా అడియన్స్ ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. దేశంలోని పలు నగరాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.