
హీరోయిజానికి నయా డెఫినియేషన్ ఇచ్చిన ఈ జనరేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు స్టార్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పూరి ఇప్పుడు తానే ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో నెక్ట్స్ మూవీ కోసం తన రూట్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా ఎనౌన్స్ చేసిన పూరి, చెన్నైలో చెక్కర్లు కొడుతున్నారు.

సినిమా అవకాశాల కోసం తాను కష్టపడుతున్న టైమ్‌లో ఎలాంటి లైఫ్ స్టైల్‌ను చూశారో... ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. రోడ్ సైడ్ టీ స్టాల్‌లో టీ, టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఆ విశేషాలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.

సినిమా ఇండస్ట్రీ గురించి పూరి తీసిన సినిమా నేనింతే. కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాకపోయినా... టాలీవుడ్ క్లాసిక్స్ లిస్ట్‌లో చేరింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమాలో తాను రాసిన డైలాగ్స్‌నే మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు డాషింగ్ డైరెక్టర్.

అందుకే చేతి మీద నాట్ పర్మినెంట్స్ అన్న టాటూతో ఈ సిచ్యుయేషన్ నుంచి త్వరలోనే బయటకి వస్తానని చెప్పకనే చెబుతున్నారు. మరి నిజంగానే పూరి బౌన్స్ బ్యాక్ అవుతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.