ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి చరణ్‌తో జోడీ కట్టింది.
దిల్ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
గేమ్ ఛేంజర్, కమలహాసన్ ఇండియన్ 2 సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తుండడమే దీనికి కారణం. దీంతో రామ్ చరణ్ సినిమా బాగా లేటవుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత దిల్ రాజు మెగా ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దిల్ రాజు తెలిపారు. ప్రభాస్ సలార్ ప్రమోషన్లలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు.
సుమారు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు