
సలార్ సినిమాలో నటించడంతో తన చిరకాల కల నెరవేరిందని అంటున్నారు పృథ్విరాజ్. ఇప్పటిదాకా జనాలు టీజర్‌లోనూ, ట్రైలర్‌లోనూ చూసింది చాలా తక్కువన్నది ఆయన చెబుతున్న మాట. ఇందులో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు, ఎన్నెన్నో ఎమోషన్స్ ఉన్నాయని అంటున్నారు పృథ్విరాజ్.

సలార్ చూసిన వాళ్లందరూ గొప్ప సినిమా చూశామన్న ఫీల్‌తో బయటకు వస్తారన్నది పృథ్విరాజ్ ఇస్తున్న హామీ. స్వతహాగా హీరో, డైరక్టర్ అయిన పృథ్విరాజ్ సలార్ గురించి చెప్పే మాటలు డార్లింగ్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నిజంగానే సినిమా అంత అద్భుతంగా వచ్చిందా? సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరగకుండా ఉండటానికే ట్రైలర్‌ని అండర్‌ప్లే చేశారా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.

ప్రభాస్ తన చుట్టూ ఉన్నవారందరికీ మంచి భోజనం తెప్పిస్తారన్న విషయాన్ని ఇప్పటికే పలువురు హీరోయిన్లు చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పృథ్విరాజ్ కూడా షేర్ చేసుకున్నారు.

తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారని, వారిలో ప్రభాస్‌తో తరచూ మాట్లాడుతుంటానని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ నియర్ అండ్ డియర్స్ లిస్టులో పృథ్విరాజ్ పేరు చేరడం సూపర్ హ్యాపీ అంటున్నారు రెబల్ సైన్యం.

డిసెంబర్ 22న విడుదల కానుంది సలార్. ఫ్రెండ్‌షిప్‌కి సరికొత్త మీనింగ్ చెబుతూ సినిమా ఉంటుందని, తప్పకుండా అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని నమ్మకంగా ఉన్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. ఎలాగైనా సలార్‌ని కూడా వెయ్యి కోట్ల లిస్టులో చూసుకోవాలన్నది ప్రశాంత్ కోరిక.