Telugu Movies: ప్రశాంత్ వర్మ బ్యాక్ టూ సెట్స్.. ప్రభాస్ మాత్రమే టాప్ 10లో..

| Edited By: Prudvi Battula

Mar 16, 2024 | 9:53 AM

హనుమాన్ సినిమాతో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ వర్మ.. మళ్లీ సెట్స్‌కు వచ్చారు. సోషల్ మీడియాలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో మాటల్లో చెప్పడం కష్టమే. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ప్రభాస్. బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. తర్వాతి సినిమాను కూడా అప్పుడే లైన్‌లో పెడుతున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు.

1 / 5
హనుమాన్ సినిమాతో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ వర్మ.. మళ్లీ సెట్స్‌కు వచ్చారు. మళ్ళీ తన హ్యాపీ ప్లేస్‌లోకి వచ్చాను, బాబు రెడీ బాబు అంటూ పోస్ట్ చేసారు వర్మ. ఇది జై హనుమాన్ కోసమా లేదంటే బాలయ్యతో సినిమా చేయబోతున్నారా.. అదీ కాదంటే ఏదైనా యాడ్ షూట్ చేస్తున్నారా అనేది సస్పెన్స్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

2 / 5
సోషల్ మీడియాలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో మాటల్లో చెప్పడం కష్టమే. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ప్రభాస్. తాజాగా ఇయర్ ఆన్ ఎక్స్ అంటూ విడుదల చేసిన హ్యాష్ ట్యాగ్ లిస్టులో ప్రభాస్ మాత్రమే టాప్ 10లో ఉన్నారు. ట్విట్టర్‌లో ఈ రేంజ్ హ్యాష్ ట్యాగ్స్ మరే ఇండియన్ స్టార్‌పై లేవు. ఇందులో ప్రభాస్ 7వ స్థానంలో ఉన్నారు.

3 / 5
బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. తర్వాతి సినిమాను కూడా అప్పుడే లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ఈయన కోసం ప్రశాంత్ వర్మతో పాటు హరీష్ శంకర్, బోయపాటి లాంటి దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే NBK 110 బోయపాటితోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్రిల్ 10న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు చేస్తారని ప్రచారం జరుగుతుంది.

4 / 5
చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో ఓ పాటను నా సామిరంగ దర్శకుడు విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేసారు. ఈయన దర్శకుడు కాకముందు డాన్స్ మాస్టర్. ఇప్పుడు చిరును కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావడంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. జెర్సీలో నాని ట్రైన్ సీక్వెన్స్ ఫోటో పోస్ట్ చేసారు విజయ్.

5 / 5
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా జరుగుతుంది. మార్చి 14 నుంచి వైజాగ్‌లో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించేందుకు టీమ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.