
ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి దర్శకులకు టోకన్ నెంబర్ పెట్టాలేమో..? ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్ అవుతున్నారీయన. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుందనేది కన్ఫ్యూజన్.

ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం రాజా సాబ్‌తో పాటు హను సినిమాలను పూర్తి చేస్తున్నారు ప్రభాస్.

హను రాఘవపూడి ఫౌజీ తర్వాత ఇమ్మీడియట్‌గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసారు సందీప్ వంగా. అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం.. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయాలని చూస్తున్నారు.

స్పిరిట్ రీ రికార్డింగ్ 70 శాతం పూర్తైందని చెప్పి షాకిచ్చారు వంగా.అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి.. ఆర్నెళ్లలో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్.

షూట్ సమయంలో మిగిలిన 30 శాతం BGM సిద్ధం చేస్తానని.. రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివర్లో గానీ.. 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.