The Raja Saab: ప్రభాస్ ను కొత్తగా చూపిస్తున్న మారుతి.. గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్

| Edited By: Phani CH

Jul 30, 2024 | 1:01 PM

వరసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్‌తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు..? ఒకప్పట్లా డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా..? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు విడుదల కాబోతుంది..? ఇవన్నీ ఒక్క టీజర్‌తో క్లారిటీ ఇచ్చేసారు మారుతి అండ్ టీం. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు.

1 / 5
వరసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్‌తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు..? ఒకప్పట్లా డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా..? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు విడుదల కాబోతుంది..? ఇవన్నీ ఒక్క టీజర్‌తో క్లారిటీ ఇచ్చేసారు మారుతి అండ్ టీం.

2 / 5

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

3 / 5
సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్. మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

4 / 5
ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజా సాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ.. ప్రభాస్‌ని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించబోతున్నారు మారుతి. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ లుక్‌లో కనిపించారు ప్రభాస్.

5 / 5
రాజా సాబ్ హార్రర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా టీజర్‌లో జోనర్ ఇదే కన్ఫర్మ్ చేసారు మారుతి. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు మేకర్స్. 2025 ఎప్రిల్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే రాజా సాబ్ షూట్ సగానికి పైగా పూర్తైంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.