యానిమల్ రిలీజ్ తరువాత నెక్ట్స్ స్పిరిట్ మూవీనే పట్టాలెక్కిస్తానని చెప్పిన సందీప్, స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. ప్రశాంత్ నీల్ సలార్ 2.. నాగ్ అశ్విన్ కల్కి 2 లైన్‌లోనే ఉన్నాయి. వీటితో పాటు తాజాగా లోకేష్ కనకరాజ్ సైతం ప్రభాస్‌తో సినిమా కోసం ట్రై చేస్తున్నారు.
అలాగే ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. వీళ్ళందరి ఆశ ఒక్కటే.. ప్రభాస్‌తో హిట్ కొడితే 1000 కోట్లతో పాటు బోనస్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనే ముద్ర పడుతుంది.
దీంతో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావటం కాస్త ఆలస్యం కానుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్.
మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. దీంతో పాటే హను రాఘవపూడి సినిమా సెట్స్‌పై ఉంది. 2025 సమ్మర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు అదే సమ్మర్ కానుకగా ఎప్రిల్ 10 రాజా సాబ్ విడుదల కానుంది.