
ది రాజాసాబ్ సినిమాను పోస్ట్ పోన్ అయిందనే ఫీలింగ్ ఏమాత్రం లేదు డార్లింగ్ ఫ్యాన్స్ లో. డిసెంబర్ లో కాకపోతే సంక్రాంతికి వస్తుంది... అయినా పండక్కి మా వాడి సినిమా వస్తే ఆ కిక్కే వేరప్పా అనే జోష్ కనిపిస్తోంది రెబల్ సైన్యంలో.

ఇంకాస్త టైమ్ దొరికింది కాబట్టి, మరింత క్వాలిటీగా ఇవ్వండి విజువల్స్ ని అనే రిక్వస్టులు మాత్రం వినిపిస్తున్నాయి. అన్నీ వింటున్నామంటున్న ది రాజాసాబ్ మేకర్స్..ఈ సారి అడగకుండానే గుడ్‌న్యూస్ చెప్పేశారు.

కాంతార చాప్టర్ 1తో పాటు ది రాజాసాబ్ ట్రైలర్‌ని విడుదల చేస్తామని అన్నారు. సో... అక్టోబర్ నెల అలా స్టార్ట్ అయ్యీ కాగానే మేం హ్యాపీ అంటున్నారు అభిమానులు. కాంతార చాప్టర్ 1 రిలీజ్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు.

జస్ట్ ఆ ఒక్క అప్‌డేట్‌తోనే ఆగడం లేదు ది రాజాసాబ్ టీమ్. డార్లింగ్ పుట్టినరోున ఓ మంచి సాంగ్ లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సరికొత్త ట్యూన్స్ తో రెడీ అయిపోయారు మ్యూజిక్ డైరక్టర్. ఇక జనాలు వినడమే ఆలస్యం అనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీమ్.

జస్ట్ రాజాసాబ్ నుంచే కాదు.. ఫౌజీ నుంచి.. స్పిరిట్ నుంచి కూడా ఏదో ఒక అప్‌డేట్ వస్తుందనే ఆశతో ఉన్నారు అభిమానులు. అటు సలార్, కల్కి టీమ్స్ కూడా ఏదో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ తో పలకరిస్తాయనే ఆశ కనిపిస్తోంది అభిమానుల్లో.