
రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ శ్రీలీల. తొలి మూవీతోనే అందం అభినయంతో పాటు బెస్ట్ డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తరువాత ధమాకా, భగవంత్ కేసరి లాంటి హిట్స్ వచ్చినా... స్కంద, ఆదికేశవ లాంటి మూవీస్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అవ్వటంతో అన్ని సినిమాలకు సరిగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు శ్రీలీల. ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అదే సమయంలో వరుస ఫ్లాప్‌లతో కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నా.. అమ్మడి తీరు మాత్రం మారటం లేదు. మరోసారి ఎడా పెడా సినిమాలకు ఓకే చెప్పేసి డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ క్యూట్ బ్యూటీ.

ఆ మధ్య వరుస సినిమాలతో పాన్ ఇండియా రేసులో ఫ్లాష్ అయిన పూజ హెగ్డే తరువాత సడన్‌గా స్లో అయ్యారు. రాధేశ్యామ్ లాంటి సినిమాలు తన కెరీర్‌ను మలుపు తిప్పుతాయన్న ఆశలతో వచ్చిన అవకాశాలు వదులుకొని ఇబ్బందుల్లో పడ్డారు.

ఆ టైమ్‌లోనే కాలు ఫ్యాక్చర్ కావటంతో పూజ కెరీర్‌లో గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న పూజా హెగ్డే, మరోసారి పాత తప్పునే రిపీట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల రిజల్ట్ చూశాకే కొత్త సినిమాలకు సైన్ చేయాలనుకుంటున్నారు పూజా. అందుకే తనని వెతుక్కుంటూ వస్తున్న ప్రాజెక్ట్స్‌ను కూడా వదులుకుంటున్నారు. దీంతో మరోసారి పూజ కెరీర్ గాడి తప్పుతోందా అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్.