Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

Edited By: Phani CH

Updated on: May 05, 2025 | 7:20 PM

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నింటికీ అలవాటు పడిపోయారు. సినిమా వస్తుందంటే ఆనందం లేదు.. రావట్లేదంటే బాధ లేదు. వచ్చినపుడు చూసుకుందాం.. రాకపోతే సర్దుకుందాం అన్నట్లు తయారైపోయారు వాళ్లు. ఇలాంటి సమయంలో ఒక గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్ వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. మరి ఆ న్యూస్‌లేంటో ఓసారి చూద్దామా..?

1 / 5
పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూడటమే మానేసారు ఫ్యాన్స్. వచ్చినపుడు వస్తాయిలే.. అప్పటి వరకు రీ రిలీజ్‌లతో సర్దుకుపోదాం అంటున్నారు. హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలైందిప్పుడు.

2 / 5
పవన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ 2 రోజుల షూటింగ్‌తో సినిమా అంతా పూర్తైపోతుంది. త్వరలోనే ట్రైలర్ అప్‌డేట్ ఇస్తామని చెప్పారు నిర్మాతలు.

3 / 5
మే 9న విడుదల చేస్తామంటూ నిర్మాతలు అనుకుంటే సరిపోదు.. పవన్ కూడా అనుకోవాలి కదా..? ఆయనున్న బిజీకి అనుకోలేదు.. దాంతో మరోసారి వాయిదా తప్పలేదు. నెక్ట్స్ షెడ్యూల్‌లో పవన్ పార్ట్ పూర్తి చేసి.. వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

4 / 5
మరోవైపు ఫ్యాన్స్ కలలు కంటున్న ఓజికి మాత్రం ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఓజి షూటింగ్ చాలా వరకు పూర్తైందని అనుకుంటున్నారంతా. కానీ తాజాగా ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ కళ్లు బైర్లు గమ్మేసాయి.

5 / 5
ఇప్పటి వరకు పవన్‌తో కాంబినేషన్ సీన్స్ షూటే చేయలేదని చెప్పారు ఈ నటుడు. మరో 2, 3 నెలల్లో షూట్ చేస్తామంటున్నారీయన. ఈ లెక్కన ఓజి ఇప్పట్లో రానట్లే. పోనీలే ఓజి రాకపోయినా.. వీరమల్లు వస్తే అదే పదివేలు అంటున్నారు ఫ్యాన్స్.