
భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణతో పవనకల్యాణ్ హరిహరవీరమల్లు షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. ఇది కదా మాకు అసలైన గుడ్‌న్యూస్ అంటున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... ప్రతి నెలా కొన్నాళ్ల పాటు మేకప్ వేసుకోవడానికి పవన్ సిద్ధమైనట్టేనా?

మరోవైపు ఆయన లేని సీన్స్ షూట్ చేసుకుంటున్నారు దర్శకులు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరుగుతుంది. దాదాపు 1000 మందితో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు.

అలాగే హరిహరవీరమల్లు డైరక్టర్లు క్రిష్, జ్యోతికృష్ణ ఫ్యూచర్ కూడా చాలా వరకు పవన్ కల్యాణ్ ఇచ్చే హిట్ మీద ఆధారపడి ఉందన్నది కాదనలేని విషయం.

హరిహరవీరమల్లు తర్వాత ఓజీ సెట్స్ కి వెళ్లాలన్నది పవర్‌స్టార్ ప్లాన్. హరిహరవీరమల్లు లుక్ నుంచి ఓజీ లుక్‌కి మేకోవర్ అవుతారు. ఓజీ బావుంటుంది.. చూద్దురుగానీ అని పవన్ అన్న మాటలు ఇంకా తమ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయని అంటున్నారు అభిమానులు.

ఓజీ లుక్‌కీ, ఉస్తాద్ భగత్‌సింగ్ లుక్‌కీ కాస్త దగ్గరపోలికలు ఉంటాయి. సో.. ఓజీని పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ గురించి ఆలోచిస్తారు పవర్‌స్టార్. అంతలో సురేందర్‌రెడ్డి స్క్రిప్ట్ కంప్లీట్ అయితే దానికి కాల్షీట్ ఎప్పుడు కేటాయించాలన్న విషయం గురించి చర్చిస్తారని టాక్.