
చాలా రోజుల సస్పెన్స్ తరువాత హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెన్యూ లాక్ అయ్యింది. ముందుగా వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై 20న ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసినా.. అభిమానులను కంట్రోల్ చేయటం అసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వేదికను హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికకు మార్చింది మూవీ టీమ్. ఈ నెల 21న ఈ వేడుక జరగనుంది.

వీరమల్లు ఈవెంట్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లతో పాటు కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ కూడా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

మరి కొంత మంది రాజకీయనాయకులు పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది హరి హర వీరమల్లు ఈవెంట్. సినీ రంగం నుంచి చాలా మంది ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు.

పవన్‌కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఎలాగూ ఈవెంట్‌లో ఉంటారు. ప్రస్తుతం పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు కూడా వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇలా టాప్ స్టార్స్‌తో వీరమల్లు వేడుక నెక్ట్స్ లెవల్‌లో జరగబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

పవన్ నటించిన తొలి పాన్ ఇండియా, తొలి పీరియాడిక్ డ్రామా కావటంతో హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో సినిమాను సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న వీరమల్లు, జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.