
ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా స్టేటస్‌కి రీచ్ అయ్యాక ప్రతి విషయాన్నీ పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో వితౌట్ డైలాగ్స్ వచ్చే టీజర్ కట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మాటలు పెట్టాల్సి వచ్చినా, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజెస్‌ని సెలక్ట్ చేసుకోవడాన్ని గురించి కూడా చెప్పుకుంటున్నారు.

సలార్ టీజర్‌ని గమనించారా? దేర్ ఈ జ్ నో కన్‌ఫ్యూజన్ అంటూ సింపుల్‌గా ఇంగ్లిష్‌లో ఇంట్రడ్యూస్ చేశారు హీరోని. దీనివల్ల టీజర్ వ్యూస్ కౌంట్ స్ప్లిట్ కాకుండా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఆయా లాంగ్వేజెస్ కోసం స్పెషల్ వర్క్ చేయాల్సిన పని లేదు. అందుకేనేమో కల్కి గ్లింప్స్ లోనూ అదే ఫార్ములా కనిపించింది.

వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే మాట తప్పితే, ఇంకో డైలాగ్ లేదు అందులో. అయినా వండర్‌ఫుల్ విజువల్స్ తో, ఎక్స్ ప్రెషెన్స్ తో, చెప్పాలనుకున్న ఎమోషన్‌ని కన్వే చేశారు నాగ్ అశ్విన్. నార్త్ మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ డైరక్ట్ చేసిన ఫైటర్ టీజర్‌లోనూ ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేదు. పాత్రల తాలూకు స్వభావాలను షాట్స్ తోనే కన్వే చేశారు మేకర్స్. ఇటు యష్ సినిమా టాక్సిక్ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలోనూ మాటలకు స్కోప్ లేదు.

2024 సంక్రాంతి రేసులో ఉన్న ప్యాన్ ఇండియన్ సినిమా హనుమాన్ టీజర్‌లో మాటలు వినిపించాయి. అయితే అవి సంస్కృతంలో ఉన్నాయి. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సంస్కృతంలో వర్ణించారు. ఆ వెంటనే హనుమాన్ చాలీసాను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుకున్నారు. అంతేగానీ పర్టిక్యులర్‌గా ఏ భాషకు ఆ భాషలో డైలాగులు లేవు. అన్ని భాషల వారినీ అట్రాక్ట్ చేయడానికి మాటలకన్నా విజువల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు మేకర్స్.