
బ్యూటీ నోరా ఫతేహి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, సింగర్‌గా , డ్యాన్సర్‌గా, మోడల్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది బాలీవు, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ముఖ్యంగా ఈ బ్యూటీ దిల్బర్ అనే సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. టెంపర్, బాహుబలిలో మనోహారి, అలాగే హిందీలో కూడా అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ, 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ సత్తా చాటుతుంది ఈ చిన్నది.

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ 2014లో వచ్చి రోర్ : టైగెర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పైకి అడుగు పెట్టి, చాలా సినిమాల్లో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. లోఫర్, ఊపిరి, కిక్ 2 వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అంద చందాలతో రచ్చ చేసింది. గ్లామర్ డోస్ పెంచుతూ, అచ్చం అప్సరే నేలకు దిగివచ్చిందా అన్నట్లు పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే.

వైట్ కలర్ సారీలో .. డిఫరెంట్ లుక్‌లో ముఖంపై వైట్ చున్నీ కప్పుతున్నట్లూ.. తన అందాలను దాచేస్తున్నట్లు కనిపించే ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.