Thammudu: ట్రాక్ మార్చాడు.. ట్రెండ్ సెట్ చేశాడు.. నితిన్ జోరు మాములుగా లేదుగా

Edited By:

Updated on: Jun 13, 2025 | 9:47 PM

ప్రమోషన్ అంటే ముందుగా ఓ టీజర్.. ఆ తర్వాత లిరికల్ సాంగ్.. ఆ తర్వాత ట్రైలర్.. ఇలా ఓ ఫార్మాట్ సెట్ చేసి పెట్టారు మన మేకర్స్. కానీ ఆ ట్రెండ్ నేనెందుకు ఫాలో అవ్వాలి.. ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు నితిన్. ఈ మధ్య బాగా వెనకబడిపోయిన ఈయన.. తమ్ముడుతో సత్తా చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం న్యూ ట్రెండ్ సెట్ చేసారీయన.

1 / 5
నితిన్ సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి గానీ ఏ ఒక్కటి అంచనాలు అందుకోవట్లేదు. మంచి టీంతోనే పని చేస్తున్నా.. కోరుకున్న విజయం మాత్రం రావట్లేదు నితిన్‌కు. కరోనాకు ముందొచ్చిన భీష్మ నితిన్‌కు చివరి హిట్.

2 / 5
ఆ తర్వాత చేసిన రంగ్ దే, మ్యాస్ట్రో, చెక్, మాచెర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ దారుణంగా నిరాశ పరిచాయి. నితిన్ ఆశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు.

3 / 5
చిన్న టీజర్ కూడా లేకుండా.. ఒక్క పాట కూడా రాకుండా డైరెక్ట్ ట్రైలర్‌నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేసారు మేకర్స్. సీరియస్ డ్రామాగా వస్తుంది తమ్ముడు. అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్ర కథ.

4 / 5
రొటీన్‌గా పాటలు, డైలాగ్స్ అని కాకుండా డిఫెరెంట్‌గా ఈ ట్రైలర్‌ను కట్ చేసారు. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందులో నితిన్ అక్కగా లయ నటిస్తున్నారు.

5 / 5
20 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. జులై 4న విడుదల కానుంది తమ్ముడు. అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ వాయిదా పడే అవకాశాలున్నాయని అర్థమవుతుంది.