- Telugu News Photo Gallery Cinema photos Nayanthara taking huge remuneration for her upcoming movies producer are in panic
Nayanthara: ఆస్తులు రాయించుకుంటున్న నయనతార.. భయపడుతున్న నిర్మాతలు
నయనతార అంటే నిర్మాతలకు ఎప్పుడూ భయమే.. ప్రమోషన్స్‌కు రారు.. పైగా రెమ్యునరేషన్ ఎక్కువ..! ఇన్ని ఉన్నా ఆమె నటన ముందు అవేం కనిపించవు. అయితే ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్‌తో చుక్కలు చూపించడం నయన్ స్పెషాలిటీ. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. జవాన్‌తో ఈమె కెరీర్‌కు మరోసారి రెక్కలొచ్చాయి. మరి ఒక్కో సినిమాకు నయన్ ఎంత డిమాండ్ చేస్తున్నారిప్పుడు..? 40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార.
Updated on: Oct 23, 2023 | 9:37 AM

నయనతార అంటే నిర్మాతలకు ఎప్పుడూ భయమే.. ప్రమోషన్స్‌కు రారు.. పైగా రెమ్యునరేషన్ ఎక్కువ..! ఇన్ని ఉన్నా ఆమె నటన ముందు అవేం కనిపించవు. అయితే ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్‌తో చుక్కలు చూపించడం నయన్ స్పెషాలిటీ. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. జవాన్‌తో ఈమె కెరీర్‌కు మరోసారి రెక్కలొచ్చాయి. మరి ఒక్కో సినిమాకు నయన్ ఎంత డిమాండ్ చేస్తున్నారిప్పుడు..?

40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు.

ముఖ్యంగా ఈ రోజుకూ ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. స్టార్ హీరోయిన్లకు సైతం నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. జవాన్ హిట్‌తో ఈమె రేంజ్ ఇంకా పెరిగిపోయింది.

20 ఏళ్లుగా సౌత్ సినిమాల్లోనే నటించిన నయన్.. ఇక్కడే రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పటికీ సినిమాకు 6 నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్‌కు కూడా రానని ముందే చెప్తుంటారు. ఇన్ని కండీషన్స్ పెట్టినా.. ఆమె క్రేజ్ ముందు అన్నీ చెల్లుతున్నాయి. జవాన్‌తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ్నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. కానీ లెక్క కూడా అదే రేంజ్‌లో అడుగుతున్నారీమే.

జవాన్‌లో యాక్షన్ రోల్‌తో దుమ్ము దులిపడంతో స్పై సినిమాకు నయన్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు దర్శకులు. తాజాగా ఓ పెద్ద హీరో సినిమా కోసం అడిగితే 16 కోట్ల వరకు డిమాండ్ చేసారని తెలుస్తుంది. ఆల్రెడీ దీపిక పదుకొనే లాంటి బ్యూటీస్ 20 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. దాంతో నయన్ అడగడంలో తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్. సౌత్‌లో నయన్ క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఎంతైనా ఓకే అనేస్తున్నారు.




