
రీసెంట్ టైమ్స్‌లో సినిమా వార్తలతో కన్నా... వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. నయన్ ప్రొఫెషనల్ వర్స్‌తో పాటు ఆ పర్సనల్ విషయాలు కూడా వివాదాలకు కారణం అవుతున్నాయి. అయితే చాలా సందర్భాల్లో సైలెంట్‌గానే ఉన్న నయన్, లేటెస్ట్ రూమర్స్ విషయంలో ఇంట్రస్టింగ్ రిప్లైతో రూమర్స్‌కు చెక్ పెట్టారు.

ఆ మధ్య లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న నయన్, రెగ్యులర్‌గా భర్తతో కలిసి ట్రిప్స్‌కు వెళుతూ సోషల్ మీడియాలో హల్ చేస్తున్నారు.

అయితే ఈ టైమ్‌లో నయన్ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది.'తెలివిలేని వాడు భాగస్వామి అయినప్పుడు పెళ్లి పెద్ద నేరంగానే అనిపిస్తుంది. భర్త చేసే తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

మీవల్ల చాలా ఫేస్ చేశా.. నన్ను వదిలేయండి...' అంటూ నయన్ పెట్టిన ఇన్‌స్టా స్టేటస్ వైరల్ కావటంతో నయన్, విఘ్నేష్ విడిపోతారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

ఫైనల్‌గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నయన్, 'మా విషయంలో సిల్లీ రూమర్స్ ట్రెండ్ అయినప్పుడు మా ఎక్స్‌ప్రెషన్ ఇదే' అంటూ భర్త విఘ్నేష్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేశారు. ఈ అప్‌డేట్‌తో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.