Nayanthara: ఊహించని షాక్ ఇచ్చిన నయనతార.. మీరు మారిపోయారు మేడమ్.. అంటున్న ఫ్యాన్స్

Edited By: Phani CH

Updated on: Mar 08, 2025 | 12:58 PM

మార్పు మంచికే.. కానీ ఇంత సడన్‌గా ఆ మార్పు ఎందుకొచ్చింది అనేదే అర్థం కాని విషయమిప్పుడు. ఇంతకీ మారిపోయిందెవరు..? మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి అనేగా మీ అనుమానం. చెప్తాం.. అక్కడికే వస్తున్నాం.. ఈ మారిన మనిషి ఎవరో తెలుసా..? అయినా తినబోతూ రుచెందుకు.. చూడబోతూ వివరాలెందుకు..? ముందు చూసేయండి మీరూ..

1 / 5
హీరోయిన్లందరిలోనూ నయనతార వేరయా అంటారు నిర్మాతలు. దానికి కారణం అందరికీ తెలుసు. ఓపెనింగ్స్‌కు రాదు.. ప్రమోషన్ చేయదు.. ఇంటర్వ్యూలు ఇవ్వదు.. నయన్ అదోరకం అంతే. కానీ ఏమైందో తెలియదు గానీ ఈ మధ్య ఈమెలో మార్పు మొదలైంది.

2 / 5
 ప్రమోషన్స్‌కు రావడమే కాదు.. కొత్తగా సినిమా ఓపెనింగ్స్‌కు కూడా రావడం అలవాటు చేసుకుంటున్నారు. చూస్తున్నారుగా.. తాజాగా మూకూతి అమ్మన్ 2 ఓపెనింగ్‌కు వచ్చారు నయన్.

3 / 5
అప్పుడెప్పుడో 20 ఏళ్ళ కింద చంద్రముఖి ఓపెనింగ్‌కు వచ్చిన నయన్.. ఆ తర్వాత మళ్లీ పూజా కార్యక్రమాలకు వచ్చింది అరుదు. మళ్లీ ఇన్నాళ్లకు మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్‌లో దర్శనమిచ్చారు.

4 / 5

2020లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'మూకూతి అమ్మన్‌'కు సీక్వెల్ ఇది. ఫస్ట్ షాట్ నయనతారపై చిత్రీకరించారు. మామూలుగా ఓపెనింగ్స్, ప్రమోషన్స్‌కు రానని చెప్పే నయన్.. కొన్నాళ్లుగా మారిపోయారు.

5 / 5
అప్పట్లో 'శ్రీరామరాజ్యం' ప్రమోషన్స్ తర్వాత.. సొంత నిర్మాణంలో చేసిన ‘కనెక్ట్’ సినిమా కోసం బాగా ప్రమోట్ చేసారు నయన్. మళ్లీ ఇప్పుడు అమ్మవారి సినిమా కోసం వచ్చారు. చూస్తుంటే కాంపిటీషన్ తట్టుకోడానికి కండీషన్స్ ఎత్తేసినట్లు కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.