
50 కోట్ల రెమ్యునరేషన్.. స్టార్ హీరోలకైతే ఇదేం పెద్ద మ్యాటర్ కాదు కానీ.. మీడియం రేంజ్ హీరోలకు ఇంత పారితోషికం అనేది ఓ కల..! ఎందుకంటే వాళ్ల సినిమాలు హిట్టైనా అన్ని కోట్లు వస్తాయా అనేది అనుమానమే.

కానీ 50 కోట్ల పారితోషికంతో ఓ టైర్ 2 హీరో రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో..? ఎందుకు ఆయనకు అంత క్రేజ్..? టాలీవుడ్‌లో ఎప్పుడూ ఓ అనుమానం అలాగే ఉంటుంది. మీడియం రేంజ్ హీరోలలో నెంబర్ వన్ ఎవరా అని..? దీనికి సమాధానంగా ఎప్పుడూ నానినే ముందు కనిపిస్తుంటారు.

వరస సినిమాలు, విజయాలతో జోరు చూపిస్తూనే ఉంటారు న్యాచురల్ స్టార్. గతేడాది దసరా, హాయ్ నాన్నతో విజయాలు అందుకున్న నాని.. ఈ ఏడాది సరిపోదా శనివారం అంటూ ఆగస్ట్ 29న వచ్చేస్తున్నారు. విజయాలే కాదు.. నాని రెమ్యునరేషన్ కూడా ట్రెండింగే.

నాని మళ్ళీ రేట్ పెంచాడంట.. ఈ లైన్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఇప్పుడూ ఇదే వినిపిస్తుంది. గతేడాది వరకు 20 కోట్లు తీసుకున్న నాని.. ఇప్పుడు మరో 5 పెంచేసారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. DVV ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌజ్ నానికి 50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని తెలుస్తుంది.

సరిపోదా శనివారం తర్వాత డివివి దానయ్య నిర్మాణంలోనే సుజీత్ సినిమా చేయబోతున్నారు నాని. సెప్టెంబర్ నుంచి ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ 2 సినిమాలకు కలిపి నాని 50 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, బలగం ఫేమ్ వేణులతోనూ సినిమాలు కన్ఫర్మ్ చేసారు న్యాచురల్ స్టార్. ఇవన్నీ హిట్టైతే ఫ్యూచర్‌లో ఒక్క సినిమాకే 50 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..?