Balakrishna: నేను అన్‌స్టాపబుల్ అంటున్న బాలకృష్ణ.. ఇందులో బాలయ్యని బీట్ చేసే హీరో లేనట్టే.
టైమ్ మేనేజ్‌మెంట్‌లో బాలయ్యను కొట్టే హీరో టాలీవుడ్‌లోనే కాదు.. వెతికితే ఇండియన్ సినిమాలోనే దొరకరేమో..? ఎంత బిజీగా ఉన్నా.. ఎంతో కొంత టైమ్ ఆయన దగ్గర ఉంటుంది. ఓ వైపు వరస సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. మరి అదేంటి.. అసలీయనకు అంత టైమ్ ఎక్కడ్నుంచి వస్తుంది..? బాలయ్య డిక్షనరీలో అసలు ఖాళీ అనే పదమే ఉండదేమో..?