2 / 5
నాగార్జున కెరీర్ మొదలై 36 ఏళ్లైంది. తాజాగా 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకువీరుడు. అతిథి పాత్రలు, చిన్న కారెక్టర్స్ అన్నీ కలిపితే నాగార్జున 100 సినిమాలు ఎప్పుడో అయిపోయాయి.. కానీ హీరోగా మాత్రం సెంచరీ కొట్టలేదు మన్మథుడు. ప్రస్తుతం చేస్తున్న నా సామిరంగా ఈయనకు 99వ సినిమా అని తెలుస్తుంది. దాంతో 100వ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు నాగార్జున.