
తండేల్ అంటే ముందు నుంచి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌తో ఒపీనియన్స్ అన్నీ మార్చేసారు దర్శకుడు చందూ మొండేటి. హై ఎమోషన్స్‌తో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది తండేల్.

ఇక నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో..? ట్రైలర్ అంతా చైతూ, పల్లవి ప్రేమకథతోనే సాగింది. మధ్య మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

2.26 నిమిషాల ట్రైలర్‌లో కథ అంతా చెప్పారు చందూ మొండేటి. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్.. ఆ తర్వాత హీరో లీడర్ కావడం.. పెళ్లి చేసుకుందాం అనుకునే టైమ్‌కు వేటకెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది.

హీరో అండ్ టీం పాకిస్తాన్ వెళ్లాక ఏం జరిగింది..? అక్కడ్నుంచి జాలర్లు అందరూ ఎలా తిరిగొచ్చారనేది అసలు కథ. సముద్రంపై వచ్చే సీన్స్‌లో VFX బాగుంది. ఇండో పాక్ పాయింట్ బాగా రిజిష్టర్ చేసారు చందూ మొండేటి.

అయితే ఎన్ని ఎమోషన్స్ చూపించినా.. చైతు, పల్లవి కెమిస్ట్రీకే ఎక్కువ మార్పులు పడ్డాయి. ఫిబ్రవరి 7న విడుదల కానుంది తండేల్. ఇప్పటికే ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్స్ అయ్యాయి.