- Telugu News Photo Gallery Cinema photos Naa Sami Ranga to Yash19 latest Films news from Movie Industry
Film News: నా సామీ రంగ గ్లింప్స్.. ఆరోజున యాష్ 19 టైటిల్ ప్రకటన..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటుడు నాని. నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా నా సామి రంగ. ట్రేడింగ్ మాధ్యమాలను సపోర్ట్ చేస్తూ తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు నటి కృతి సనన్. యానిమల్ సినిమాలో విలన్‌గా నటించారు బాబీ డియోల్. యష్ హీరోగా నటించే 19వ సినిమా టైటిల్‌ను ఈ నెల 8న ఉదయం 9.55కి ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్.
Updated on: Dec 06, 2023 | 2:20 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటుడు నాని. ఆయన నటించిన హాయ్ నాన్న ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో విలేకరులతోనూ మాట్లాడారు. హాయ్ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా అవుతుందని అన్నారు నాని.

నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా నా సామి రంగ. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది.

ట్రేడింగ్ మాధ్యమాలను సపోర్ట్ చేస్తూ తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు నటి కృతి సనన్. ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ లతో తనకు అనుబంధం లేదని చెప్పారు. తప్పుడు వార్తల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం కృతి చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలున్నాయి.

యానిమల్ సినిమాలో విలన్‌గా నటించారు బాబీ డియోల్. తన కేరక్టర్ ప్రేక్షకులకు నచ్చినందుకు భావోద్వేగానికి గురయ్యారు బాబీ. యానిమల్‌ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు బాబీ. యానిమల్‌లో లుక్ కోసం మూడు నెలల పాటు స్వీట్లు తినడం మానేశారు బాబీ.

యష్ హీరోగా నటించే 19వ సినిమా టైటిల్‌ను ఈ నెల 8న ఉదయం 9.55కి ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కేవీయన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గీతూ మోహన్‌దాస్ డైరక్షన్ చేస్తారని సమాచారం. కేజీయఫ్2 తర్వాత యష్ నటిస్తున్న సినిమా ఇదే.




