
సీతారామం సినిమాతో సౌత్ ఆడియన్స్ పలకరించిన అందాల భామ మృణాల్ థాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను హాట్ ఫేవరెట్‌గా మారిపోయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు కొత్త స్కెచ్ రెడీ చేస్తున్నారు ఈ బ్యూటీ.

సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హోల్ ఇండియా ప్రేమలో పడిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలతో పెద్దగా గుర్తింపు లేని ఈ బ్యూటీ ఈ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా పాపులర్ కావటంతో అసలెవరీ సీత అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. అదే సమయంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రజెంట్ నాని హీరోగా తెరకెక్కుతున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నారు మృణాల్. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

వరుస షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రజెంట్ ఆన్‌లైన్ క్లాస్‌కు కూడా అటెండ్ అవుతున్నారు. తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకుంటున్నారు. త్వరలో ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యారు సిల్వర్ స్క్రీన్ సీత.

సౌత్‌లో హోమ్లీ ఇమేజ్‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ నార్త్‌లో మాత్రం అల్ట్రా గ్లామరస్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. బాలీవుడ్ స్క్రీన్ మీదే కాదు, పబ్లిక్ అపియరెన్సుల్లోనూ హాట్ షోతో అదరగొడుతున్నారు.