Crazy Songs: కమర్షియల్ హిట్స్ కోసం మాస్ బీట్స్.. ఏంటా సాంగ్స్.?
పక్కా కమర్షియల్ సినిమా అన్నాక హీరో హీరోయిన్లు దుమ్ము రేపే స్టెప్పులు వేసేయాలి. స్టేజ్ దద్దరిల్లేలా చేసే అలాంటి డ్యాన్సులకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. హీరో పక్కన ఓ హీరోయిన్ ఉంటేనే అంత క్రేజ్ ఉంటే, సాంగ్‌లో హీరోకి చెరో వైపు ఇద్దరు కనిపిస్తే... ఆ మాస్ బీట్లను కోరుకోకుండా ఎవరుంటారు చెప్పండి అంటారా? ఈ తరహా పాటలు నార్త్ లోనే కాదు... సౌత్‌లోనూ కోకొల్లలు. రీసెంట్‌గా... 'దానికేమో మేకలిస్తివి.. నాకేమో సన్నబియ్యం నూకలిస్తివీ' అంటూ గుంటూరు కారంలో క్లిక్ అయిన కుర్చీ మడతపెట్టి పాట ఇలాంటిదే.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: May 18, 2024 | 4:07 PM

ఈ తరహా పాటలు నార్త్ లోనే కాదు... సౌత్‌లోనూ కోకొల్లలు. రీసెంట్‌గా... 'దానికేమో మేకలిస్తివి.. నాకేమో సన్నబియ్యం నూకలిస్తివీ' అంటూ గుంటూరు కారంలో క్లిక్ అయిన కుర్చీ మడతపెట్టి పాట ఇలాంటిదే.

ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో ఎన్నెన్ని రీల్స్ చేశారో జనాలు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు స్టెప్పులేసి క్రియేటివిటీని చూపించేశారు. మహేష్‌కి ఓ వైపు పూజా హెగ్డే, మరో వైపు పూర్ణ డ్యాన్సుతో ఫిదా చేసేశారు.

గతంలో జక్కన్న కూడా ఈ తరహా ట్రయల్స్ వేసి సక్సెస్ చూసిన వారే. బాహుబలిలో ఇరుక్కు పో పాటను, అందులో ఇంట్రస్టింగ్‌గా స్టెప్స్ ని కంపోజ్ చేయించిన తీరును అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. యమదొంగలో యంగ్ యమా, బాహుబలిలో ఇరుక్కుపో.. పాటలను మించి సాంగ్‌ని మహేష్ మూవీలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సినిమాలో సరైన సిట్చువేషన్ ఉండాలేగానీ, యూజ్ చేసుకోవడంలోనూ నేను కూడా ముందు ఉంటానని అంటారు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్‌లో దిమ్మాక్ ఖరాబ్ సాంగ్ పిక్చరైజేషన్, ఎడిటింగ్, కంపోజింగ్... ప్రతిదీ ఫిదా చేసింది కుర్రకారును. ఇలాంటి పాట డబుల్ ఇస్మార్ట్ లోనూ ఉంటుందా?

మన దగ్గరే కాదు, కోలీవుడ్‌లోనూ ఇద్దరు హీరోయిన్ల పాటలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య సమంత, నయనతార కలిసి టూ టూ అంటూ వేసిన స్టెప్పులు ఫేమస్ అయ్యాయి. రీసెంట్‌గా బాక్ సినిమాలో తమన్నా, రాశీఖన్నా పోటీ పడ్డ తీరు కూడా ఆడియన్స్ ని మెప్పించింది.





























