Tollywood News: టాలీవుడ్ కు మరో షాక్.. థియేటర్స్ అన్నీ ఖాళీ.. అసలు ఏమైందంటే ??

| Edited By: Phani CH

Apr 22, 2024 | 1:43 PM

ఇంతకంటే పరిస్థితులు దిగజారవేమో అనుకున్న ప్రతీసారి.. అంతకంటే దారుణమైన పరిస్థితులను చూస్తుంది టాలీవుడ్. మరీ ముఖ్యంగా ఎన్నికల కారణంగా సినిమాల్లేక అల్లాడిపోతున్న బాక్సాఫీస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పరిస్థితి మనకు కూడా వచ్చిందా అంటూ తల పట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ ఏంటా సిచ్యువేషన్..?సంక్రాంతికి మన సినిమాలు బాగానే మడతబెట్టాయి.. ఓ వైపు గుంటూరు కారం, మరోవైపు హనుమాన్, ఇంకోవైపు నా సామిరంగా దెబ్బకు వసూళ్ల వర్షం కురిసింది.

1 / 5
పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా స్క్రీన్‌ మీద సత్తా చాటుకుంటే ఓటీటీ సంస్థలు కాసింత ఓపిగ్గానే వ్యవహరిస్తున్నాయి.  ఎనిమిదంటే, ఎనిమిది వారాల్లోనే ఓటీటీ రిలీజ్‌ చేసేస్తామని అనడం లేదు. థియేటర్లలో రన్‌ని గౌరవిస్తున్నాయి.

2 / 5
సంక్రాంతికి మన సినిమాలు బాగానే మడతబెట్టాయి.. ఓ వైపు గుంటూరు కారం, మరోవైపు హనుమాన్, ఇంకోవైపు నా సామిరంగా దెబ్బకు వసూళ్ల వర్షం కురిసింది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఫిబ్రవరి టూ ఏప్రిల్.. ఈ మధ్యలో టిల్లు స్క్వేర్ మాత్రమే బ్లాక్‌బస్టర్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్‌కు నిరాశ తప్పలేదు.

3 / 5
చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

4 / 5
ఇప్పటికీ అదే టిల్లు, అదే మంజుమల్ బాయ్స్‌, అదే ఫ్యామిలీ స్టార్‌పై ఆధారపడుతున్నాయి థియేటర్స్. అవైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాయి చెప్పండి..? ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది. ఏప్రిల్ 19న అరడజన్ సినిమాలు వచ్చాయి.. కానీ ఒక్కటి కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.. టికెట్లు తెగట్లేదు.

5 / 5
అందుకే ఆక్యుపెన్సీ లేక షోస్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే వారం ప్రతినిధి 2, విశాల్ రత్నం లాంటి సినిమాలు రానున్నాయి. మరి అవైనా బాక్సాఫీస్ దగ్గర కాస్తో కూస్తో సందడి చేస్తాయేమో చూడాలి.