- Telugu News Photo Gallery Cinema photos Movie makers have created a new trend called cross promotions
Cross Promotions: క్రాస్ ప్రమోషన్స్ అంటూ నయా ట్రెండ్.. అసలు ఏంటి ఇది.?
ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఇప్పుడిదే చేస్తున్నారు మన హీరోలు. ఒక్కసారి ప్రమోట్ చేస్తే చాలు.. రెండు సినిమాలకు హెల్ప్ అవ్వాలనేది మన హీరోల ప్లాన్ ఇప్పుడు. అందుకే కొత్త రకమైన ఇంటర్వ్యూలకు తెర తీస్తున్నారు. గతంలో దేవర లాంటి సినిమాలు కూడా ఇదే ఫాలో అయ్యాయి. ఇంతకీ ఈ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఏంటి..?
Updated on: May 02, 2025 | 9:50 AM

ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. ఎంత కొత్తగా ప్రమోట్ చేసుకుంటే.. రీచ్ అంత బాగుంటుంది. దానికోసమే మన హీరోలు కనిపెట్టిన కొత్త ప్రమోషనల్ పాలసీ క్రాస్ ఇంటర్వ్యూస్. కొత్తగా ఉంది కదా..! చాలా సింపుల్.. రిలీజ్‌కు దగ్గరగా ఉన్న రెండు సినిమాల హీరోలు కలిసి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడమే ఈ క్రాస్ ప్రమోషన్స్.

గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేసారు. ఓ వైపు దేవర ప్రమోషన్ చేసారు.. అలాగే జిగ్రా సినిమా ప్రమోషన్ కూడా అయిపొయింది. ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ఇంటర్వ్యూ అన్నమాట.

అదే ఏడాది వారం గ్యాప్‌లో వచ్చిన స్వాగ్, జనక అయితే గనక సినిమాలకు ఇలాంటి ప్రమోషనే ప్లాన్ చేసారు. అక్టోబర్ 4న స్వాగ్ వస్తే.. 12న జనక అయితే గనక వచ్చింది. అందుకే సుహాస్, శ్రీ విష్ణు క్రాస్ ఇంటర్వ్యూ చేసారు.

2023లో దసరా, రావణాసుర వారం గ్యాప్‌లో వచ్చినపుడు రవితేజ, నాని చేసిన ఇంటర్వ్యూ ఆకట్టుకుంది. అయితే వీటిలో దసరా బ్లాక్ బస్టర్ అయింది. రావణాసుర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కస్టడీ, ఏజెంట్ కోసం చైతూ, అఖిల్.. కూడా ఇలాంటి క్రాస్ ఇంటర్వ్యూలే చేసారు. ఈ మధ్య ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అవుతుంది కూడా. అందుకే అనేది మరి.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనేది. చుడాలిక ఈ ట్రెండ్ ఇంకా ఎన్ని సినిమాలు ఫాలో అవుతాయో.




