Benefits Shows: నిర్మాతలకు థియేటర్ ఎగ్జిబిటర్లు షాక్.. ఇకపై వాటికీ నో..

Edited By:

Updated on: May 28, 2024 | 8:00 AM

రెండు మూడు రోజుల్లోనే ఇండస్ట్రీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అసలే సినిమాల్లేక చుక్కలు కనిపిస్తుంటే.. ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయాలతో నిర్మాతలకు మరింత మంటెత్తిపోతుంది. ఇకపై నో బెనిఫిట్ షోస్ అని చెప్పి పెద్ద షాకే ఇచ్చారు సింగిల్ స్క్రీన్ యాజమాన్యం. అంటే ఈ లెక్కన ఇకపై ఫ్యాన్స్‌కు ఎర్లీ సెలబ్రేషన్స్ లేనట్లేనా..? వాళ్ల నిర్ణయం వెనక కారణమేంటి..?

1 / 5
గత వారం రోజులుగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ గురించి చర్చ బాగా జరుగుతుంది. సినిమాల్లేక రెండు వారాలు థియేటర్స్ కూడా మూసేసారు ఎగ్జిబిటర్లు. అంతేకాదు ఓ మీటింగ్ పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

2 / 5
అందులో ముఖ్యంగా ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ఉండవని కుండ బద్ధలు కొట్టారు. సాధారణంగా పెద్ద సినిమాలేవి విడుదలైనా కూడా ముందు రోజు రాత్రి.. లేదంటే రిలీజ్ రోజు అర్థరాత్రి బెనిఫిట్ షోస్ వేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది.

3 / 5
అయితే ఈ బెనిఫిట్ షోలు వేసేది వేరే వాళ్లు.. వచ్చిన షేర్‌లో కొంతమేర థియేటర్స్‌కు ఇస్తుంటారు కానీ అది ఏం సరిపోకపోగా.. అభిమానులు చేసే అల్లరికి థియేటర్లకే అదనపు భారం పడుతుంది.

4 / 5
 బెనిఫిట్ షోస్ వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎగ్జిబిటర్లు. అందుకే ఇకపై వీటిని ప్రదర్శించమంటున్నారు వాళ్లు. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తామని తెలిపారు.

5 / 5
 ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్న కారణంగా.. కల్కి, పుష్ప2, గేమ్ చేంజర్, భారతీయుడు 2 సినిమాలకు ఈ రూల్స్ వర్తించవు. వాటికి యధావిధిగా బెనిఫిట్ షోస్ ఉంటాయి. ఇంకా ఈ సినిమాలు కూడా బెనిఫిట్ షోస్ ఉండబోవని వెల్లడి.