- Telugu News Photo Gallery Cinema photos Mirai to Raghava Lawrence latest movie updates from Tolllywood
Movie Updates: తేజ మరో విజువల్ ట్రీట్.. రాఘవ లారెన్స్ గొప్ప మనసు..
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన సినిమా జితేందర్‌రెడ్డి. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా సారంగదరియా. 13 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను అందించారు నటుడు రాఘవ లారెన్స్.
Updated on: Apr 21, 2024 | 3:38 PM

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతకాంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న సినిమాను టూడీ, త్రీడీలో విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

ఆది సాయికుమార్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ని ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంది. చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి.

విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన సినిమా జితేందర్‌రెడ్డి. 1980లో జరిగిన వాస్తవిక సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం లచ్చిమక్క అంటూ మంగ్లీ పాడిన పాటను విడుదల చేశారు. మంచి కంటెంట్‌తో మే 3న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. అబ్బిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని అభిలషించారు శ్రీవిష్ణు.

13 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను అందించారు నటుడు రాఘవ లారెన్స్. వాళ్లు మల్లరకంబాన్ని ప్రదర్శించిన తీరు చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని అన్నారు. ఇప్పుడు వాహనాలను అందిస్తున్నానని, త్వరలోనే వారికి సొంతింటి సదుపాయాన్ని కలిగిస్తాయని చెప్పారు లారెన్స్. ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




