Chiranjeevi: కుర్ర దర్శకులను నమ్ముకుంటున్న సీనియర్ హీరోలు.! చిరు షూటింగ్ స్టార్ట్.
విశ్వంభర షూటింగ్ మొదలై నెల రోజులు దాటిపోయింది.. మొదటి షెడ్యూల్ కూడా వేగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చిరంజీవి సెట్‌లో అడుగు పెట్టలేదు..? ఏమైంది.. మెగాస్టార్ ఎప్పుడు సెట్‌కు వస్తారు..? ఇంకెన్ని రోజులు పడుతుంది..?ఈ డౌట్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసారు మెగాస్టార్. విశ్వంభర కోసం కసరత్తులు మొదలుపెట్టారు చిరు. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్..! భోళా శంకర్ తర్వాత తెలియకుండానే భారీ బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. మధ్యలో ఓ సినిమా ప్లాన్ చేసినా కుదర్లేదు.