- Telugu News Photo Gallery Cinema photos Mega Power Star Ram Charan is back on the sets in Game changer Movie Telugu Entertainment Photos
Ram Charan: తండ్రి అయిన తరువాత ఫస్ట్ టైం సెట్స్ లో అడుగు పెట్టిన రామ్ చరణ్..
తిరిగి సెట్‌లో అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్ అయిన చెర్రీ, షార్ట్ బ్రేక్ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు. ఇప్పటికే ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ వర్క్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ట్రిపులార్ సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు రామ్ చరణ్. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది. చరణ్ సీఎంగా, గవర్నమెంట్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Aug 10, 2023 | 9:03 PM

తిరిగి సెట్‌లో అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్ అయిన చెర్రీ, షార్ట్ బ్రేక్ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు. ఇప్పటికే ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ వర్క్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ట్రిపులార్ సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు రామ్ చరణ్. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది. రీసెంట్‌గా చరణ్ తండ్రి కావటంతో ఈ సినిమా మరింత డిలే అవుతుందని భావించారు ఇండస్ట్రీ జనాలు.

ఓ వైపు ఫాదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో వైపు షూటింగ్ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్. తాజాగా గేమ్ చేంజర్ వర్క్ రీ స్టార్ట్ చేశారు చెర్రీ.

హైదరాబాద్‌లో షార్ట్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు... వెంటనే సెట్‌లో అడుగుపెట్టేశారు. మంగళవారం స్టార్ అయిన ఈ షెడ్యూల్ ఈ నెల 21 వరకు కంటిన్యూ కానుంది.

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరకల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. శంకర్ కూడా ఇండియన్ 2 వర్క్‌కు బ్రేక్ ఇచ్చిన కొద్ది రోజులు గేమ్ చేంజర్ టీమ్‌తోనే ట్రావెల్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

చరణ్ సీఎంగా, గవర్నమెంట్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను 2024 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.





























