Meenakshi Chaudhary: అదృష్టమంటే ఈ అమ్మాయిదే.. ఇక్కడ మహేష్ బాబు.. ఇక్కడ ఇళయదళపతి సినిమాలో ఛాన్స్..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరీ. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెరంగేట్రం చేసిన మీనాక్షి.. ఇటీవల హిట్ 2 సినిమాతో విజయం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంలో అనుహ్యంగా పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మీనాక్షిని వరించింది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. అంతేకాకుండా గుంటూరు కారం విడుదలకు ముందే మీనాక్షి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.