AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మలయాళం సినిమాలు ఈ మధ్య వరుసగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పుడిప్పుడే సరికొత్త కంటెంట్ వెబ్ సిరీస్ లు కూడా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నిజానికి మార్చి 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 10:33 PM

Share
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన మలయాళ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ సిరీస్ మార్చి 20 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

1 / 5
ఈ వెబ్ సిరీస్ 2000వ దశకం ప్రారంభంలో కేరళలోని కాసరగోడ్ జిల్లా నేపథ్యంలో సాగుతుంది. అజి (అబూ సలీమ్), చెమ్ము (గోవింద్ పాయ్) అనే ఇద్దరు కజిన్స్ తమ పేదరికం నుండి బయటపడాలని కన్న కలలు వారిని నేర ప్రపంచం వైపు నడిపిస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వారు నకిలీ పాస్‌పోర్టులు మరియు సర్టిఫికెట్లు తయారు చేసే ఒక ముఠాలో చేరతారు.

2 / 5
అక్రమ రవాణా చేసే కింగ్ పిన్ దమ్మన్న (కబీర్ దుహాన్ సింగ్) మరియు పోలీసుల మధ్య ఈ పోరు ఎలా సాగిందనేది ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తం. ఒక చిన్న పొరపాటు వల్ల వారు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, చివరకు వారి పరిస్థితి ఏమైందనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సిరీస్‌లో నెగటివ్ రోల్స్‌లో కనిపించే కబీర్ దుహాన్ సింగ్ తన నటనతో మెప్పించారు. అబూ సలీమ్, గోవింద్ పాయ్, సుధీష్, దీపక్ పరంబోల్ మరియు రోనీ డేవిడ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

3 / 5
దర్శకుడు అతీష్ ఎం. నాయర్ 2000వ దశకంలోని వాతావరణాన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్‌లతో రూపొందింది. ఐఎండీబీ (IMDb)లో దీనికి 7.4 రేటింగ్ లభించడం విశేషం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారైతే 'కాసరగోడ్ ఎంబసీ' ఖచ్చితంగా చూడదగ్గ సిరీస్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ కథలో సహజత్వం ఎక్కువగా ఉంటుంది. మేకర్స్ మొదటి ఎపిసోడ్‌ను ఉచితంగా వీక్షించే సౌకర్యం కల్పించారు.

4 / 5
 కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ కు అతీష్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్‌లో 'మార్కో' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, అబు సలీమ్, గోవింద్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించగా. సుధీష్, దీపక్ పరంబోల్, రోనీ డేవిడ్, దినేష్ ప్రభాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హీరాజ్ పీహెచ్ ఈ సిరీస్‌కు కథ అందించగా, రతీష్ వేగ సంగీతం సమకూర్చారు.

5 / 5
Follow Us