నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్. మ్యూజిక్ పరంగానూ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిన ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సాధించింది.
ఈ పాటలో ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్‌లో చేసిన డ్యాన్స్, గ్లోబల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు నార్త్ మేకర్స్.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్పేస్తే థియేటర్లు ఊగిపోవటం ఖాయం.
అందుకే వాళ్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించారు.
ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.