
ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా పొలిటికల్ హీట్ గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో యాత్ర 2 లాంటి సినిమాల మీద పోకస్ పెరుగుతోంది. అయితే ఈ సినిమాల కాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.

జీవా, మమ్ముటి ప్రధాన పాత్రల్లో మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా యాత్ర 2. తాజాగా ఈ సినిమాలో భారతి పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మరాఠి నటి కేటకి నారాయణ్ యాత్ర 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తరువాత ఆడియన్స్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ సీరియస్ డిస్కషన్ జరుగుతోంది.

కేటకి, భారతి పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు యాత్ర సినిమా విషయంలో ఏ క్యారెక్టర్ కూడా ఇంత పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వలేదంటున్నారు క్రిటిక్స్. యాక్చువల్‌గా క్యారెక్టర్‌ల ఎంపికలో లుక్స్ సిమిలర్‌గా ఉండాలన్న ప్రయత్నం ఇంత వరకు చేయలేదు దర్శకుడు మహి. కానీ భారతి విషయంలో మాత్రం పెద్దగా కష్టపడుకుండానే అలా సెట్ అయ్యింది.

ఆ మధ్య చంద్రబాబు పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ బాబు పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు. అయితే లుక్స్ పరంగా ఏ మాత్రం సిమిలారిటీస్ లేని మహేష్ మంజ్రేకర్‌ను చంద్రబాబు రోల్‌కు సెలెక్ట్ చేయటంపై ఆసక్తికరంగా మారింది.

అయితే మేనరిజమ్స్‌లో సిమిలారిటీస్ ఉంటే చాలు లుక్స్ ఎలా ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్నది మహి వి రాఘవ నమ్మకం. అందుకే యాత్ర విషయంలో ఫాలో అయిన ఫార్ములానే యాత్ర 2 విషయంలోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.