ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. ఈ మధ్యే ఫార్మాల్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజులు పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు.
రెగ్యులర్ షూటింగ్ సమ్మర్‌లో స్టార్ట్ చేస్తారన్న న్యూస్ వైరల్ అయ్యింది. కానీ ఈ విషయంలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు జక్కన్న. షార్ట్ గ్యాప్‌లోనే సెకండ్ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది రాజమౌళి టీమ్. హైదరాబాద్‌లోనే అమేజాన్ అడవుల సెట్‌ను సిద్ధం చేసిన మేకర్స్ అక్కడే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా పని మీదే హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా... లుక్ టెస్ట్‌లో పాల్గొన్నారు. లుక్ ఫైనల్ కావటంతో త్వరలో పీసీ పార్ట్ కూడా షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు రాజమౌళి.
ఈ సినిమాకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండానే సైలెంట్‌గా షూటింగ్ స్టార్ట్ చేశారు. మేకింగ్ విషయంలో స్పీడు చూపిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, గ్రాఫిక్స్‌కు ఎక్కువ టైమ్ తీసుకునేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న అడ్వంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి.
ఆల్రెడీ ట్రిపులార్‌తో గ్లోబల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిన జక్కన్న, మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా సినిమాను రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు.