
పాటకు 100 మిలియన్ వ్యూస్ వస్తేనే పండగ చేసుకుంటున్న రోజులివి. అలాంటిది కొన్ని పాటలు ఏకంగా యూ ట్యూబ్‌లో 500 మిలియన్స్ వ్యూస్ దాటి.. 1000 మిలియన్ల వైపు పరుగులు పెడుతున్నాయి. అవి కూడా మళ్లీ మన తెలుగు ఇండస్ట్రీలోనే. మరి ఆ రేంజ్‌లో రచ్చ చేస్తున్న సాంగ్స్ ఏంటి..? అసలు యూ ట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ దాటిన తెలుగు పాటలెన్ని ఉన్నాయి..?

యూ ట్యూబ్‌లో తెలుగు పాటలు రప్ఫాడిస్తున్నాయి. ఇన్నాళ్లూ కేవలం హిందీ, ఇంగ్లీష్ పాటలకు మాత్రమే వందల మిలియన్ల వ్యూస్ వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడా ట్రెండ్ మనోళ్లు మొదలుపెట్టారు.

తాజాగా గుంటూరు కారంలోని కుర్చీ మడతబెట్టి పాటకు యూ ట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రిలీజైన 9 నెలల్లోనే ఈ రికార్డు సాధించింది కుర్చీ మడతబెట్టి సాంగ్.

తెలుగులో 500 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు రెండు మాత్రమే ఉన్నాయి. ఈ రెండూ అల్లు అర్జున్ పేరు మీదే ఉన్నాయి. అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ 897 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉండగా.. 706 మిలియన్ వ్యూస్‌తో రాములో రాములా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత కుర్చీ మడతబెట్టి 500 మిలియన్ వ్యూస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

తమిళంలో మాత్రం 500 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు బాగానే ఉన్నాయి. ధనుష్, సాయి పల్లవి రౌడీ బేబీ పాట ఏకంగా 1.6 బిలియన్ వ్యూస్ అంటే 1600 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇక అరబిక్ కుత్తు వీడియోకు 662 మిలియన్ వ్యూస్ వస్తే.. లిరికల్ సాంగ్‌కు సైతం 527 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మాస్టర్ వాతి కమింగ్ పాట 521 మిలియన్ వ్యూస్