ఇండియన్ స్క్రీన్ మీద వెయ్యి కోట్ల క్లబ్ ను ఓపెన్ చేసింది తెలుగు సినిమా. ఆ వెంటనే ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది బాలీవుడ్. ఎలాంటి అంచనాలు లేకపోయినా కన్నడ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో సత్తా చాటింది. కానీ ఇంత వరకు ఈ మార్కెట్ లో బోని చేయలేకపోయింది కోలీవుడ్. అందుకే ఆ బాధ్యత నేను తీసుకుంటా అంటున్నారు లేటెస్ట్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్.
బాహుబలి సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఆ తరువాత దంగల్, పఠాన్, జవాన్ లాంటి నార్త్ మూవీస్, కేజీఎఫ్ 2 లాంటి కన్నడ సినిమా ఈ క్లబ్ లో స్థానం సంపాదించుకున్నాయి. కానీ పాన్ ఇండియా అన్న పదం వాడుక లోకి రాకముందే నేషనల్ సినిమాలు ఇచ్చిన తమిళ సినిమా మాత్రం ఇంత వరకు వెయ్యి కోట్ల మార్క్ ను రీచ్ అవ్వలేకపోయింది. అందుకే అప్ కమింగ్ సినిమాలతో ఆ కోరిక తీరుతుందా అని ఎదురుచూస్తున్నారు అరవ ఆడియన్స్.
శంకర్, మణిరత్నం లాంటి దర్శకులు ఇప్పటికే వందల కోట్ల వసూళ్లు సాధించినా... వెయ్యి కోట్ల మార్క్ ను మాత్రం టచ్ చేయలేదు. 2.ఓ, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. కానీ వెయ్యి కోట్ల మార్క్ ను మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. ఆల్రెడీ లియో సినిమాతో 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన లోకేష్, నెక్ట్స్ టార్గెట్ వెయ్యి కోట్లే అంటున్నారు.
లియో తరువాత రజనీకాంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. ఎల్‌సీయూలో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. లియోతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన లోకేష్, ప్రమోషన్ మాత్రం రీజినల్ మార్కెట్ లోనే చేశారు. కానీ రజనీ సినిమా విషయంలో పబ్లిసిటీకి కూడా స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. రీసెంట్ గా జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీ కూడా లోకేష్ మూవీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
రజనీ మేనియాకు లోకేష్ టేకింగ్ కూడా తోడైతే వసూళ్ల విషయంలో డౌటే ఉండదని భావిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సారి టార్గెట్ వెయ్యి కోట్లని గట్టిగా ఫిక్స్ అయి బరిలో దిగుతున్నారు. మరి ఈ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..? రజనీ, లోకేష్ కాంబో తమిళ సినిమా కల నెరవేరుస్తుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.