
2025లో బాక్సాఫీస్ వద్ద అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన సినిమాలు.. మంచి విజయాన్ని అందుకున్నాయి. కూలీ, హిట్ 3, తుడురమ్, ఎల్ 2 ఎంపురాన్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వ్చచింది. కేవలం 30 కోట్లతో తెరకెక్కించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లు రాబట్టింది.

చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం మౌత్ పబ్లిసిటీ బలంతోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతేకాదు.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఓ హీరోయిన్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హి్ట గా నిలిచింది. ఆ సినిమా పేరు కొత్త లోకా చాప్టర్ 1 చంద్ర.

కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఇందులో మహిళా సూపర్ హీరో పాత్రను పోషించింది. ప్రమోషన్లకు అంతగా డబ్బు ఖర్చు చేయలేదు. కానీ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

మొదటి వారం ఆదివారం నాటికి, ఈ చిత్రం రూ. 10 కోట్లు సంపాదించింది. ఇందులో చంద్ర పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది కళ్యాణి. అవయవాల అక్రమ రవాణా ముఠాను ఆమె కనుగొంటుంది. ఈ సినిమా మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్కును దాటింది.

మొదట ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేయగా.. ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 301.45 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇంకా అఫీషయల్ ప్రకటన రాలేదు. కానీ అక్టోబర్ 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.