- Telugu News Photo Gallery Cinema photos Kk to lata mangeshkar these indian celebrities who died in 2022
Celebrities Death: ఈ ఏడాదిలో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.. లతా మంగేష్కర్ నుంచి కేకే వరకు..
2022 సినీపరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత ఆరు నెలల్లో చాలా మంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మంగళవారం ప్రముఖ గాయకుడు కేకే అకాలమరణంతో సినీ పరిశ్రమ దిగ్ర్బాంతికి గురయ్యింది. కోల్ కత్తాలో లైవ్ షో ప్రదర్శన అనంతరం కేకే గుండెపోటుతో మరణించారు. ఈ ఏడాదిలో ఎంతో మంది సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.
Updated on: Jun 01, 2022 | 9:09 PM

లతా మంగేష్కర్.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. ఈఏడాది ఫిబ్రవరి 6న మరణించారు.

బప్పి లహరి.. ప్రముఖ గాయకుడు బప్పి లహరి (69). ఫిబ్రవరి 15న మరణించారు.

తాతినేని రామరావు.. సినీ నిర్మాత టి. రామారావు. 1966 నుంచి 2000 మధ్య దాదాపు 75 హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 20న తాతినేని రామారావు తుదిశ్వాస విడిచారు.

శివకుమార్ శర్మ.. భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ (84) మే 10న గుండెపోటుతో ముంబైలో మరణించారు.

సంధ్య ముఖర్జి.. నేపథ్య గాయని మరియు సంగీత విద్వాంసురాలు గీతాశ్రీ 15 ఫిబ్రవరి 2022న వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో కన్నుమూశారు.

సిద్ధూ మూస్ వాలా.. సింగర్ సిద్ధూ మూస్ వాలా (28) మే 29న మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

సింగర్ కేకే. ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ మే 31న కోల్ కత్తాలో గుండెపోటుతో మరణించారు. దక్షిణాది చిత్రాల్లో దాదాపు 200లకు పైగా.. హిందీలో 500లకు పైగా పాటలు పాడారు కేకే.




