Kiran Abbavaram: రహస్య దసరా సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?

Updated on: Sep 30, 2025 | 7:55 PM

హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య ఈ ఏడాది మేనెలలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ పిల్లాడితో కలిసి దసరాని సెలబ్రేట్ చేసుకుంది రహస్య. అనంతరం ఆ ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.

1 / 6
 టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జోడీ ఒకటి. తమ మొదటి సినిమాలోనే ప్రేమలోనే పడిన వీరు గతేడాది ఇరు పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కారు.

2 / 6
 2024 ఆగస్టులో పెళ్లిపీటలెక్కారు  కిరణ్ అబ్బవరం- రహస్య. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మే నెలలో ఓ బుడ్డోడు ఈ దంపతుల జీవితంలోకి అడుగు పెట్టాడు.

3 / 6
 కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి సన్నిధానంలో తమ కుమారుడి నామకరణమహోత్సవం నిర్వహించారు కిరణ్ అబ్బవరం దంపతులు. తమ బుడ్డోడికి 'హను అబ్బవరం' అని పేరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

4 / 6
 తాజాగా తన కుమారుడితో కలిసి దసరా పండగను సెలబ్రేట్ చేసుకుంది రహస్య.  అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపింది.

5 / 6
 ప్రస్తుతం కిరణ్ అబ్బవరం షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో కిరణ్ కుమారుడు హను చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

6 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కే-ర్యాంప్ అనే సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.