
హిట్టు ఫ్లాపులతో పనిలేదు.. ఓపెనింగ్స్ పరంగా విజయ్ దేవరకొండ ఎప్పుడూ క్రౌడ్ పుల్లరే.. మనోడికి సరైన సినిమా పడిన రోజు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది.

తాజాగా కింగ్డమ్ సినిమాతో మరోసారి అదే చేసి చూపించారు రౌడీ హీరో. ఈ సినిమాకు అన్నిచోట్ల నుంచి అదిరిపోయే టాక్ వచ్చేసింది.. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మళ్ళీ రావా, జెర్సీ లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి.. ఈసారి పూర్తిగా స్టైల్ మార్చేసారు. ఓ పెద్ద గ్యాంగ్ స్టర్ వరల్డ్‌నే క్రియేట్ చేసారు. విజయ్ చెప్పినట్లు ఇది నిజంగానే గౌతమ్స్ కింగ్డమ్.. ఆయన పాత్రలు, ఆ ఎమోషన్స్ బలంగానే కనెక్ట్ అవుతున్నాయి.

ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు రెచ్చిపోయారు రౌడీ బాయ్. గ్యాంగ్ స్టర్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు.. కానీ తనదైన రైటింగ్‌తో కింగ్డమ్‌ను ప్రత్యేకంగా మార్చారు గౌతమ్ తిన్ననూరి.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు కూడా అత్యున్నతంగా ఉన్నాయి. టెక్నికల్ వైజ్ టాప్ నాచ్‌లో ఉంది కింగ్డమ్. క్లైమాక్స్‌లో పార్ట్ 2కు కూడా మంచి లీడ్ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత విజయ్ జూలు విదిల్చారు.