
బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న మహానటికి బిగ్ బూస్ట్ ఇచ్చింది ఓ సినిమా. తెర మీద కనిపించకపోయినా... ఇప్పుడు కీర్తి పేరు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అల్ట్రా గ్లామరస్ రోల్స్ చేసినా రానీ క్రేజ్ జస్ట్ వాయిస్ ఓవర్‌కే రావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు కీర్తి.

కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకమైన బుజ్జి పాత్రకు వాయిస్ ఇచ్చారు హ్యాపెనింగ్ హీరోయిన్ కీర్తి సురేష్. కేవలం తెలుగు, తమిళ మాత్రమే కాదు, అన్ని భాషల్లోనూ ఆ క్యారెక్టర్‌కు ఆమె డబ్ చేశారు. దీంతో ఇప్పుడు నేషనల్ లెవల్‌లో కల్కి సినిమాతో పాటు కీర్తి పేరు కూడా ట్రెండ్ అవుతోంది.

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్, స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంలో మాత్రం తడబడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసినా... అనుకున్న రేంజ్‌లో క్రేజ్ రాలేదు.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్కవుట్ కాకపోవటంతో గ్లామర్ టర్న్ తీసుకున్నారు మహానటి. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్‌గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫార్ములా వర్కవుట్ అయినా... స్టార్ లీగ్‌లో ప్లేస్ మాత్రం దొరకలేదు.

ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్లతో పోటి పడేందుకు గ్లామరస్ ఫోటోషూట్స్‌తోనూ రచ్చ చేశారు ఈ బ్యూటీ. అయితే ఈ ట్రయల్స్ ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ బుజ్జి కోసం చెప్పిన వాయిస్ ఓవర్ మాత్రం కీర్తి సురేష్‌ని పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ లీగ్‌లోకి తీసుకువచ్చిందంటున్నారు ఫ్యాన్స్.