Keerthy Suresh: రూట్ మార్చిన కీర్తి సురేష్.. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న ముద్దుగుమ్మ
ఇన్నాళ్లు ఎమోషనల్, ఇన్‌స్పిరేషనల్ సినిమాలు మాత్రమే చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. సెంటిమెంట్‌ను పక్కన పెట్టి కామెడీ, సీరియస్ రోల్స్ ట్రై చేస్తున్నారు. తాజాగా సెట్స్ మీద ఉన్న సినిమా కోసం యాక్షన్ సీన్స్‌లోనూ నటిస్తున్నారు. మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, తరువాత విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు. పాండమిక్ టైమ్‌లో ఓటీటీలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హల్ చల్ చేశారు.