
సీనియర్ల స్పీడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏడాది ముందు అమితాబ్ అండ్ కమల్‌హాసన్ గురించి చెప్పుకోవాలి. సినిమాలు ముందూ వెనకాలుగా విడుదలైనా, అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు వచ్చినా... విషయం ఎలా ఉన్నా 2024ని స్పెషల్‌గా మార్క్ చేసుకుంటున్నారు లెజెండ్స్.

శ్రీకాంత్ చెప్పిన కథకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ తన రెండో సినిమాను కూడా నాని కాంబినేషన్‌లోనే ప్యారడైజ్ మూవీని రూపొందిస్తున్నారు శ్రీకాంత్.

మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్ కూడా జెట్ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు.

ఈ వారం వేట్టయన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు బిగ్ బీ. ప్యాన్ ఇండియా డార్లింగ్‌తో కల్కి, సూపర్‌స్టార్‌తో వేట్టయన్‌తో యమా క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంటున్నారు అమితాబ్.

లుక్ నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మరో రేంజ్ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది రిలీజ్‌కి ముస్తాబవుతోంది హరిహరవీరమల్లు.

ఎన్నికల వల్ల ఆలస్యం కాకుంటే ఈ దసరా బరిలో దూకేసేది ఎన్బీకే109. అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతోంది. మరోవైపు బోయపాటి సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్‌కి సిద్ధమవుతోంది. మోక్షజ్ఞతో మరో సినిమా ఎలాగూ ఉంది.. వీటిలో ఎన్ని రిలీజ్‌కి రెడీ అవుతాయో... బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారోననే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది.