జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ దేవర వైపు వచ్చేసారు.. మరి వార్ 2 పరిస్థితేంటి..? దానికి ఎప్పుడు డేట్స్ ఇస్తారు..? ఇస్తే దేవరను ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? వార్ కోసం దేవరను పక్కనబెడతారా లేదంటే రెండు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తారా..? ఇవే అనుమానాలు తారక్ ఫ్యాన్స్‌లో చాలా రోజులుగా ఉన్నాయి.
అసలు దేవర షూట్ ఎక్కడ జరుగుతుంది..? వార్ 2 వైపు వెళ్లేదెప్పుడు..? జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా అదుర్స్ అంటున్నారిప్పుడు. దేవరతో పాటు వార్ 2కు కూడా కమిట్ అవ్వడంతో.. ఈ రెండింటి మధ్య కచ్చితంగా క్లాష్ తప్పదని ముందు నుంచి అనుకుంటున్నారంతా.
అది తారక్‌కు తెలియంది కాదు.. అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్. మొన్నటి వరకు వార్ 2 షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరిగింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చారు తారక్. రాగానే దేవర వైపు టర్న్ తీసుకున్నారు తారక్.
ఇకపై దేవర పూర్తయ్యే వరకు నో వార్ అంటున్నారు జూనియర్. మరో నెల రోజుల్లోపే దేవర పార్ట్ 1 షూట్ పూర్తి కానుంది. అందుకే కొరటాల సినిమాను పూర్తి చేసాకే.. వార్ 2 అంటున్నారు యంగ్ టైగర్. వార్ 2లో స్పైగా నటిస్తున్నారు తారక్.
ఇప్పటికే సినిమాలో తన పార్ట్ 40 శాతం పూర్తి చేసారు ఈ హీరో. ఇప్పటి వరకు జూనియర్.. హృతిక్ సీన్స్ విడివిడిగా తీసిన అయన్ ముఖర్జీ.. కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవర పూర్తి చేస్తే ఏ టెన్షన్ ఉండదని.. జూన్ అంతా ఇక్కడే ఉండబోతున్నారు తారక్. మొత్తానికి దేవర పూర్తయ్యే వరకు.. తారక్‌కు ఈ రెండు పడవల ప్రయాణం తప్పట్లు లేదు.