
సినిమా రేంజ్ ప్యాన్ ఇండియాకి ప్రమోట్ అయితే, ఆర్టిస్టుల లుక్కుల పరంగా కూడా ఆ వేరియేషన్ స్పష్టంగా కనిపించాలి. బాహుబలి నుంచి ఇప్పటిదాకా మనం చూసి అలవాటు పడ్డ ట్రెండ్ అదే. ఇప్పుడు సెట్స్ మీదున్న పుష్ప, తంగలాన్, కంగువ, కెప్టెన్ మిల్లర్‌లోనూ అదే పద్ధతి కనిపిస్తోంది. మరి తారక్ మాత్రం నా దారి రహదారి అని ఎందుకు అంటున్నట్టు?

ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఆ మేకోవర్ చూసి ఫిదా అయిపోయారు జనాలు. అటు చరణ్ కూడా ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమా మేకింగ్ ఉన్నప్పుడు హీరోలు ఆ రకంగా కష్టపడటం కొత్తేం కాదు. అల్లు అర్జున్ పుష్ప కోసం ఎంత కష్టపడ్డారో స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు సెట్స్ మీదున్న కంగువ సినిమాలోనూ సూర్య నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా థర్టీ ప్లస్ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా కోసం నడిప్పిన్ నాయగన్ లుక్ పూర్తిగా మార్చేసుకున్నారు.

సార్‌లో గడ్డంతో మెప్పించిన ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్‌లో కొత్తగా కనిపిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రెస్టీజియస్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

కొలీగ్స్ అందరూ ప్యాన్ ప్రాజెక్టుల కోసం లుక్కులు మారుస్తుంటే, ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవర కోసం పెద్దగా గెటప్ చేంజ్ చేసినట్టు అనిపించలేదు. పోస్టర్‌లో థిక్ బియర్డ్, లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నా, బయట మాత్రం మామూలుగానే ఉన్నారు. రీసెంట్‌గా ఎలక్షన్ రోజు తారక్‌ని చూసిన వారందరూ హీరో లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాల్సి రావడం వల్లే లుక్ పరంగా తారక్ పెద్దగా ఎక్స్ పెరిమెంట్స్ చేయట్లేదా? అనే టాక్ కూడా వినిపిస్తోంది.