Jahnavi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ ఆలా.. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఇలా

Edited By:

Updated on: Mar 07, 2024 | 2:41 PM

అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిపోయారు జాన్వీ కపూర్. అయినా అమ్మ అనుకున్నది చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి..? అందుకే అదే చేస్తున్నారు జాన్వీ. అమ్మ మాదిరే సౌత్‌లోనే జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే రెండు పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్‌కు రాయల్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. అతిలోక సుందరి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురిగా 2018లో ‘ధడక్‌’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

1 / 5
అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిపోయారు జాన్వీ కపూర్. అయినా అమ్మ అనుకున్నది చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి..? అందుకే అదే చేస్తున్నారు జాన్వీ. అమ్మ మాదిరే సౌత్‌లోనే జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే రెండు పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్‌కు రాయల్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ.

2 / 5
అతిలోక సుందరి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురిగా 2018లో ‘ధడక్‌’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ తెలుగులో జాన్వీ కపూర్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది.

3 / 5
హిందీ, తమిళంలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా.. ఆమెను తెలుగమ్మాయిలాగే చూసారు మన ప్రేక్షకులు. అతిలోకసుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది. జాన్వీ కపూర్‌కు ఈ అభిమానమే శ్రీరామరక్షలా మారుతుంది. నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీలో జెండా పాతేస్తున్నారు జాన్వీ కపూర్.

4 / 5
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా.. జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో.. జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే ఈమెకు వరంగా మారుతుంది. ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో జోడీ కడుతున్న ఈమెకు.. తాజాగా రామ్ చరణ్‌తోనూ నటించే అవకాశం వచ్చింది.

5 / 5
బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు.. దేవర, RC16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండిచ్చినా.. సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటుంది.