హిందీ సినిమా అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదిప్పుడు. ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు డా అంతే. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న సహా చాలా మంది హీరోయిన్లకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవి కూడా ఇదే ట్రై చేస్తున్నారు.
శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్‌తో పాటు మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్ సినిమాకు సైన్ చేసారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ సినిమాకు సైన్ చేసినా.. తర్వాత ఈమె ప్లేస్‌లో పూజా హెగ్డే వచ్చారు.
కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ 2025లోనే ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి చుడాలిక సరేలే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఎలా జరగనుందో అని.
సాయి పల్లవి అయితే పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేసారు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యకి జోడిగా తండేల్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో రామాయణ్‌లో సీతగా నటిస్తున్నారు. ఇది 2 భాగాలుగా రాబోతుంది.
2026, 2027 దివాళికి ఈ రామాయణ్ మూవీ 2 పార్ట్స్ విడుదల కానున్నాయి. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా డెబ్యూ కానున్న సినిమాతో 2025లోనే బాలీవుడ్‌కు పరిచయం కానున్నారు సాయి పల్లవి.